Kanakavva Aada Nemali Lyrics – Kanakavva & Mangli

Share With Friends

Kanakavva Aada Nemali Lyrics – Kanakavva & Mangli

Credits :-
Additional Lyrics : Kasarla Shyam
Singers : Kanakavva & Mangli
Category : Telangana Folk
Director : Kamli 
Song Label : Mangli Official

Kanakavva Aada Nemali Song Lyrics In Telugu

నర్సపేల్లే… ఏ… నర్సపేల్లే
నర్సపేల్లే గండిలోన గంగధారి.. ఆడి నెమలీ ఆటలకు గంగధారి

ఆడి నెమలీ ఆటలకు గంగధారి… మొగ నెమలి మోసపాయే గంగధారి

ఇద్దరాము కూడుదాము గంగధారి… ఒద్దిమాను కొరుగుదాము గంగధారి

నిన్ను నన్ను చూసినంక… మంది కంట్ల మంటలాయే
ముద్ధు ముచ్చటోర్వలేక… ముక్కు మూతి తిప్పుడాయే
పట్టుకోర నువ్వు పిట్టలోలే… ఎగిరి బుంగ సెయ్యి
 
నర్సపేల్లే… ఏ… నర్సపేల్లే
నర్సపేల్లే గండిలోన గంగధారి.. ఆడి నెమలీ ఆటలకు గంగధారి
నర్సపేల్లే గండిలోన గంగధారి.. ఆడి నెమలీ ఆటలకు గంగధారి
ఆడి నెమలీ ఆటలకు గంగధారి… మొగ నెమలి మోసపాయే గంగధారి
ఆడి నెమలీ ఆటలకు గంగధారి… మొగ నెమలి మోసపాయే గంగధారి

ఇద్దరిదీ కంటి నీరు గంగధారి… ఒద్దిమాను కుంట నిండే గంగధారి

ఒద్దిమాను కుంట ఎనక గంగధారి… ఇద్దుమిరుస సన్న ఒడ్లు గంగధారి

ఇద్దుమిరుస సన్న ఒడ్లు గంగధారి… ఇద్దరికీ తలంబ్రాలు గంగధారి

కస్సు బుస్సు మనకురయ్య… పాలపొంగు లెక్క నువ్వు
నీళ్ళు సల్లి నట్టు జల్లి… సల్లబడినవంటే సాలు
ఏలు పట్టుకోని తిరుగు… ఎంటి లెక్క చూసుకుంటా

నర్సపేల్లే… ఎహె… నర్సపేల్లే
నర్సపేల్లే గండిలోన గంగధారి.. ఆడి నెమలీ ఆటలకు గంగధారి
నర్సపేల్లే గండిలోన గంగధారి.. ఆడి నెమలీ ఆటలకు గంగధారి
ఆడి నెమలీ ఆటలకు గంగధారి… మొగ నెమలి మోసపాయే గంగధారి
ఆడి నెమలీ ఆటలకు గంగధారి… మొగ నెమలి మోసపాయే గంగధారి

నువ్వు నేను కూడినప్పుడు గంగధారి… కొత్త కుండల తేనె ఓలె గంగధారి ||2||
కొత్త కుండల తేనె ఓలె గంగధారి… పాత కుండల పాశమోలే గంగధారి ||2||
పాత కుండల పాశమోలే గంగధారి… పాలనేతుల బాసలాయే గంగధారి ||2||
పాలనేతుల బాసలాయే గంగధారి… పాసిపోయే దీనమొచ్చే గంగధారి ||2||

పాసిపోతేమాయే గాని… ఆశ సావకున్నదయ్య
గోసలన్ని తీరిపోయే… మాసమచ్చే చూడరయ్య
రాసబొమ్మలైతే నువ్వు… తీగలెక్క అల్లుకుంట

నర్సపేల్లే… నర్స… నర్సపేల్లే
నర్సపేల్లే గండిలోన గంగధారి… ఆడి నెమలీ ఆటలకు గంగధారి
నర్సపేల్లే గండిలోన గంగధారి… ఆడి నెమలీ ఆటలకు గంగధారి
ఆడి నెమలీ ఆటలకు గంగధారి… మొగ నెమలి మోసపాయే గంగధారి
ఆడి నెమలీ ఆటలకు గంగధారి… మొగ నెమలి మోసపాయే గంగధారి

About lyricsdon08

Check Also

Acharya – Laahe Laahe Song Lyrics (Telugu)

Share With Friends Acharya – Laahe Laahe Song Lyrics New Telugu Song Laahe Laahe from Movie …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *